: ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్... మురళీ విజయ్ ను దుర్భాషలాడిన వీడియో వైరల్


ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్ చుట్టూ వివాదాలు ముసురుకుంటున్నాయి. నోటి దురుసుతో స్మిత్ వివాదాలకు కేంద్రంగా మారుతున్నాడు. తాజాగా జరుగుతున్న రెండో టెస్టు 53.3 ఓవర్లలో మురళీ విజయ్ పట్టిన క్యాచ్ తో ఆసీస్ ఆటకట్టిందని భావించిన టీమిడియా ఆటగాళ్లు సంబరాలు చేసుకున్నారు. మురళీ విజయ్ ఏకంగా పెవిలియన్ బాటపట్టాడు. ఈ సమయంలో ఆసీస్ బ్యాట్స్ మన్ రివ్యూ కోరారు. దీంతో అంపైర్ ఈ అవుట్ రీ ప్లేను పలుమార్లు చూశారు. ఇందులో మురళీ విజయ్ చేతుల్లో బంతి ఇమిడిపోయినప్పటికీ నేలను తాకినట్టు కనిపించింది. ధర్మశాల పిచ్ పై పచ్చిక ఉండడంతో పచ్చిక కారణంగా అలా కనిపించింది. వాస్తవానికి బంతికి నేలకి మధ్యలో మురళీ విజయ్ చేతి వేలు ఉంది. అయినప్పటికీ అంపైర్ నాటౌట్ గా ప్రకటించాడు.

 దానిని పలు మార్లు రివ్యూ చూసిన కోహ్లీ ఆగ్రహానికి గురయ్యాడు. ఔట్ ను నాటౌట్ అంటాడేంటని ఆశ్చర్యపోయాడు. అదే సమయంలో ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ డ్రెస్సింగ్ రూంకి వెళ్లేందుకు లేచి, అంపైర్ నాటౌట్ ప్రకటించడంతో తీవ్ర ఆగ్రహానికి లోనయ్యాడు. దీంతో 'ఫ... చీట్' అంటూ తిట్టాడు. ఇది కెమెరా కంటికి చిక్కింది. తరువాత అదే ఓవర్ లో 5వ బంతికి అశ్విన్ హేజిల్ వుడ్ ను అవుట్ చేయడంతో ఆసీస్ ఆలౌట్ అయింది. స్మిత్ తిట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోను మీరు కూడా చూడండి.


  • Loading...

More Telugu News