: ‘కాటమరాయుడు’ పైరసీపై ఫిర్యాదు!
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన ‘కాటమరాయుడు’ చిత్రానికి పైరసీ సెగ తగిలింది. నాలుగు రోజుల క్రితం విడుదలైన ఈ చిత్రం పైరసీపై నిర్మాణ సంస్థ నార్త్ స్టార్ ఎంటర్ టైన్ మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ హైదరాబాదు సీసీఎస్ పోలీసులను ఆశ్రయించింది. పైరసీకి కారకులపై చర్యలు తీసుకోవాలని మార్కెటింగ్ ఉపాధ్యక్షుడు సాయి రామకృష్ణ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. కాగా, పవన్ కల్యాణ్ సరసన శ్రుతి హాసన్ నటించిన ఈ చిత్రానికి దర్శకుడు కిషోర్ పార్థసాని కాగా, నిర్మాత శరత్ మరార్.