: తానిచ్చిన హామీలను గుర్తు చేస్తుంటే కేసీఆర్ కు ఎందుకంత కోపం?: సీపీఐ నేత చాడ
ఇచ్చిన హామీలను గుర్తు చేస్తుంటే సీఎం కేసీఆర్ కు ఎందుకు కోపం వస్తున్నదో అర్థం కావట్లేదని సీపీఐ నేత చాడ వెంకట్ రెడ్డి ప్రశ్నించారు. ఎన్నికల సమయంలో దళితులకు మూడు ఎకరాల భూమి, డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇస్తామని, దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానంటూ కేసీఆర్ ఇచ్చిన హామీలను అమలు చేయాలని గుర్తు చేస్తుంటే తమపై ఆయనకు ఎందుకంత కోపం వస్తుందో అర్థం కావట్లేదని అన్నారు.
కాగా, ఈ రోజు సీపీఐ తలపెట్టిన ‘చలో అసెంబ్లీ’ భగ్నం అయింది. ఉదయం నుంచే హిమాయత్ నగర్ లోని ఏఐటీయూసీ భవన్ వద్ద పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రోడ్డు పైకి వచ్చిన వారందరినీ పోలీసులు బలవంతంగా అరెస్ట్ చేసి నారాయణ గూడ పోలీస్ స్టేషన్ కు తరలించారు.