: రెండు సార్లు వైట్ హౌస్ కంచె దాటేందుకు ప్రయత్నించిన మహిళ... అలారం మోగడంతో భద్రతా సిబ్బంది పరుగులు!


అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్ కంచెపై నుంచి దూకేందుకు ఓ మహిళ మూడు సార్లు ప్రయత్నించడం కలకలం రేపుతోంది. వివరాల్లోకి వెళ్తే... శ్వేత సౌధానికి పక్కనే వుండే ట్రెజరీ బిల్డింగ్‌ వద్ద ఉన్న కంచెపై నుంచి దూకేందుకు అర్ధరాత్రి మార్సి అండర్‌ సన్‌ అనే మహిళ ప్రయత్నిస్తుండగా, భద్రతాధికారులు అదుపులోకి తీసుకున్నారు. మార్చి 21న ఆమె తొలిసారి ఇలా వైట్ హౌస్ కంచె దాటుతూ అలారం మోగడంతో పట్టుబడింది. విచారణలో అధ్యక్షుడు ట్రంప్‌ తో మాట్లాడాలని భావించి కంచె దూకే ప్రయత్నం చేశానని వెల్లడించింది. అప్పట్లో ఆమెను వదిలేశారు.

అయితే, మళ్లీ ఈ నెల 24న మరోసారి అలాగే దూకే ప్రయత్నంలో ఉండగా, భద్రతా సిబ్బంది ఆమెను అదుపులోకి తీసుకున్నారు. తాజాగా గత రాత్రి అమెరికా అధ్యక్ష భవనంలో అలారం మోగడంతో భద్రతా సిబ్బంది ఉరుకులు పరుగులు పెట్టారు. ఈ సారి కూడా ఆమె వారికి పట్టుబడింది. దీంతో ఆమెను హెచ్చరించి, ఆమె నుంచి వైట్ హౌస్ కు సంబంధించిన మ్యాప్ ను స్వాధీనం చేసుకున్నారు. 

  • Loading...

More Telugu News