: హీరో ధనుష్ పుట్టుమచ్చలు తీయించేసుకున్నట్లు కోర్టుకు నివేదిక ఇచ్చిన వైద్యులు
తమిళ నటుడు ధనుష్ తమ కుమారుడేనంటూ కదిరేశన్, మీనాక్షి దంపతులు వేసిన పిటిషన్‌పై ఈ రోజు మధురై కోర్టు మరోసారి విచారణ జరిపింది. ధనుష్ తన పుట్టు మచ్చలను లేజర్ చికిత్స ద్వారా చెరిపేయించుకున్నారని తేల్చిన నివేదికను వైద్య బృందం కోర్టుకు అప్పగించింది. వైద్యుల నివేదికపై విచారణ జరిపిన కోర్టు ఈ కేసులో తదుపరి విచారణను వచ్చేనెల 11కు వాయిదా వేస్తున్నట్లు తెలిపింది.
ధనుష్ తమ బిడ్డే అంటున్న కదిరేశన్, మీనాక్షి దంపతులు ఆధారాలుగా చెబుతున్న పుట్టుమచ్చలను పరిశీలించాలని కోర్టు ఆదేశాలివ్వడం, ధనుష్ ఆ పుట్టుమచ్చలను చెరిపేయించుకున్నారని వైద్యులు తేల్చడంతో ఈ కేసు మరింత ఉత్కంఠగా మారింది.