: ట్రంప్ కారు ఖరీదు 100 కోట్లు... ఎన్నో ప్రత్యేకతలు!


అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రయాణించే కారు ఖరీదు 100 కోట్ల రూపాయలని తెలుస్తోంది. ఇలాంటి కార్లు ప్రపంచం మొత్తం మీద కేవలం 12 మాత్రమే ఉన్నాయి. ఈ కారు పేరు బీస్ట్. ఈ కారు ఆద్యంతమూ ప్రత్యేకతలతో కూడి వుంటుంది. ఈ కారు బాంబులు, జీవరసాయన దాడులను అడ్డుకుంటుంది. ఈ కారు హెడ్ లైట్స్ వద్ద కెమెరాలు ఉంటాయి. ఇవి పగలు, రాత్రి కూడా స్పష్టమైన ఫోటో, వీడియోలు తీయగలవు. ఈ కారు తలుపుల మందం 8 అంగుళాలుంటుంది. దీనికి బోయింగ్‌-757 విమానానికి ఉండేలాంటి తలుపులే ఉంటాయి.

ఇందులో అధ్యక్షుడితో కలిపి నలుగురు కూర్చునే సదుపాయం ఉండగా, ప్రతి వ్యక్తిని వేరు చేస్తూ, గ్లాస్‌ పార్టీషన్‌ ఉంటుంది. దీనిని కేవలం అధ్యక్షుడు మాత్రమే కిందకు దింపగలడు. ఐదు అంగుళాల మందంతో రూపొందించిన అద్దాలను ఈ కారుకు కిటికీలుగా అమర్చారు. ఇవి తుపాకీ బుల్లెట్లను ఆపగలవు. రెయిన్‌ ఫోర్స్‌డ్‌ స్టీలు పేట్లతో ఈ కారును తయారు చేశారు. దీంతో ఇది బాంబు దాడులను కూడా తట్టుకోగలదు.

అత్యవసరంలో వినియోగించేందుకు అగ్నిమాపక పరికరాలు అమర్చి ఉంటాయి. ఇందులోని డాష్‌ బోర్డులో కమ్యూనికేషన్‌ సెంటర్‌, జీపీఎస్‌ ట్రాకింగ్‌ సిస్టమ్‌ లు ఉంటాయి. వీటితోపాటు ఈ కారులోనే సెల్‌ టవర్‌ కూడా ఉండడం విశేషం. దీనితో పాటు నేరుగా అధ్యక్షుడి సీటుకే శాటిలైట్‌ ఫోను ఉంటుంది. ఈ ఫోను ఉపాధ్యక్షుడు, పెంటగాన్‌ (అమెరికా రక్షణ వ్యవస్థ ప్రధాన కేంద్రం) లోని కీలక అధికారులకు డైరెక్ట్‌ లైన్‌ అనుసంధానమై ఉంటుంది.

అలాగే డ్రైవర్‌ పక్క సీటును ఆనుకుని, అత్యాధునిక ఆయుధాలతో పాటు, అధ్యక్షుడి గ్రూపునకు చెందిన రక్తం ప్యాకెట్లు కూడా సిద్ధంగా ఉంటాయి. కారుకు పంక్చర్‌ అయినా, పగిలిపోయినా ముందుకు వెళ్లగలగడం దీని ప్రత్యేకత. ఈ కారును నడిపే డ్రైవర్‌ కు అమెరికా రహస్య సేవ విభాగ అధికారులు శిక్షణ ఇస్తారు. ప్రమాదకర పరిస్థితుల్లో 180 డిగ్రీల ‘జె’ టర్న్‌ తో కారును తప్పించగల సామర్థ్యం అతని సొంతమై ఉంటుంది.

  • Loading...

More Telugu News