: చెవిరెడ్డిని విడిచి పెట్టిన పోలీసులు!
ఈ రోజు ఉదయం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ గేటు బయట దీక్షకు దిగిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసి మంగళగిరి పోలీస్ స్టేషన్‌కు తరలించిన విషయం తెలిసిందే. అయితే, కొద్దిసేపటి క్రితం ఆయనను పోలీసులు విడుదల చేశారు. ఈ సందర్భంగా చెవిరెడ్డి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై మండిపడ్డారు. ఆయన పాలనను తాలిబన్ల పాలనతో పోల్చారు. తన దీక్షను కొనసాగిస్తానని తేల్చిచెప్పారు. అధికారులతో వాదనకు దిగిన టీడీపీ నేతలు కేశినేని నాని, బొండా ఉమాలపై చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు.