: లక్ష్యం చిన్నదే...జాగ్రత్తగా ఆడితే విజయం నల్లేరు మీద నడకే!


బోర్డర్-గవాస్కర్ పేటీఎం ట్రోఫీలో భాగంగా ధర్మశాలలో జరుగుతున్న చివరిదైన నాలుగో టెస్టులో భారత్ ముందు ఆస్ట్రేలియా జట్టు ఉంచిన లక్ష్యం చిన్నదే. భారత్ పై కేవలం 105 పరుగుల ఆధిక్యం సాధించిన ఆసీస్...టీమిండియాకు 106 పరుగుల లక్ష్యం నిర్దేశించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టీమిండియా బ్యాటింగ్ ప్రారంభించింది. ఆసీస్ మట్టికరిచిన పిచ్ పై భారత ఆటగాళ్లు ఆసీస్ పేసర్లను సమర్ధవంతంగా ఎదుర్కుంటున్నారు. మూడో రోజు ఆట ముగిసేసరికి టీమిండియా 19 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్ (13), మురళీ విజయ్ (6) జాగ్రత్తగా ఆడుతున్నారు. ఇలాగే రేపు రెండు సెషన్లు టీమిండియా ఆడగలిగితే సిరీస్ ను భారత్ సొంతం చేసుకుంటుందనడంలో ఎలాంటి అనుమానం లేదు. ఏదైనా అద్భుతం జరిగితే తప్ప ఈ టెస్టులో ఆసీస్ గెలవడం అసాధ్యమని చెప్పచ్చు. టీమిండియా టాప్ ఆర్డర్, రాహుల్, విజయ్, పుజారా, రహానేపై బ్యాటింగ్ భారం మోయాల్సిన బాధ్యత ఉంది. వీరిలో ఇద్దరు నిలదొక్కున్నా టీమిండియాదే విజయం. 

  • Loading...

More Telugu News