: సౌతాఫ్రికా బాల్ ట్యాంపరింగ్... బాల్ మార్చిన అంపైర్లు!
హామిల్టన్ వేదికగా సౌతాఫ్రికా, న్యూజిలాండ్‌ల మధ్య జరుగుతున్న మూడో టెస్టు మ్యాచులో బౌలింగ్ చేస్తోన్న సౌతాఫ్రికా బౌలర్లు బాల్ ట్యాంపరింగ్ ఆరోపణలు ఎదుర్కున్నారు. బాల్ ఆకృతిని ఉద్దేశ పూర్వకంగానే మార్చారని భావించిన అంపైర్లు మ్యాచ్ మధ్యలోనే బాల్‌ను మార్చారు. ఈ మ్యాచుకి రాడ్ టక్కర్, బ్రూస్ ఆక్సెన్‌ఫర్డ్ అంపైర్లుగా వ్యవహరిస్తున్నారు. బంతి ఒక్కసారిగా రివర్స్ స్వింగ్ అవుతుండటంపై సందేహించి, వారీ విషయాన్ని గుర్తించారు. దీనిపై వెంటనే స్పందించిన సౌతాఫ్రికా కెప్టెన్ ఫ్లాప్ డుప్లెస్సీ ఆటలో భాగంగానే బంతి ఆకృతి మారిందని, ఉద్దేశపూర్వకంగా మార్చలేదని వాదించాడు. మ్యాచు మధ్యలో సౌతాఫ్రికా ఫీల్డర్లు బాల్‌ను ఉద్దేశపూర్వకంగా కీపర్‌కు నేరుగా బంతిని విసరకుండా, ఒక బౌన్స్ అయ్యేలా విసరడాన్ని అంపైర్లు గ్రహించారు.