: భారతీయుడిపై దాడి ఘటనపై స్పందించిన ఆస్ట్రేలియా హై కమిషన్


ఆస్ట్రేలియాలో ఉంటున్న కేరళ కొట్టాయంకు చెందిన లీ మ్యాక్స్ జాయ్ అనే యువకుడిపై ఇటీవ‌ల జ‌రిగిన దాడి క‌ల‌క‌లం రేపిన విష‌యం తెలిసిందే. అతను హోబర్ట్‌లోని మెక్ డొనాల్డ్ రెస్టారెంట్‌కు కాఫీ తాగేందుకు వెళ్లగా ఈ దాడి జ‌రిగింది. అయితే, ఈ విద్వేష పూరిత‌ దాడిపై ఆస్ట్రేలియా హై క‌మిష‌న్ స్పందిస్తూ.. ఈ దాడి విచారకరమని పేర్కొంది. ఈ దాడిలో సదరు భారతీయుడికి స్పల్ప గాయాలయ్యాయని, ఆసుప‌త్రిలో చికిత్స తీసుకొని డిశ్చార్జ్ అయ్యాడ‌ని తెలిపింది. భారతీయులు సహా త‌మ దేశంలో నివసించే ప్రతి ఒక్కరి రక్షణ, భద్రతకు తాము ప్రాధాన్యం ఇస్తున్నామని చెప్పింది. ఈ దాడిపై టాస్మానియా పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారని, దాడి వెనుక జాత్యహంకార కోణం ఉందా? లేక ఇతర కారణాలు ఉన్నాయా? అనే విష‌యాన్ని తెలుసుకుంటున్నార‌ని చెప్పింది.

  • Loading...

More Telugu News