: మణిపూర్‌లో లోయలో పడ్డ టూరిస్ట్ బస్సు.. 10 మంది మృతి.. 25 మందికి గాయాలు
పర్యాటకులతో వెళుతున్న ఓ టూరిస్ట్ బస్సు లోయలో పడి 10 మంది ప్రాణాలు కోల్పోయిన ఘటన మణిపూర్‌లో చోటు చేసుకుంది. ఈ ఘటనలో మరో 25 మందికి తీవ్రగాయాలయ్యాయని పోలీసులు తెలిపారు. క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలించిన సహాయక బృందాలు వారికి చికిత్స అందిస్తున్నాయి. పోలీసులు ఈ ప్రమాద ఘటన గురించి వివరిస్తూ.. రాష్ట్రంలోని సేనాపతి జిల్లాలోని ఇంఫాల్-దిమాపూర్ మార్గంలో పర్యాటకులతో వెళ్తున్న బస్సు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న లోయలో పడిందని తెలిపారు. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని చెప్పారు.