: స్మార్ట్‌ఫోన్ లలో ఏయే రకం యాప్ లను అత్యధికంగా వాడుతున్నారో తెలుసా?
స్మార్ట్‌ఫోన్ చేతిలో లేకపోతే ఏదో కోల్పోతున్నట్లుండే భావన ప్రస్తుతం ఎంతో మందిలో ఉంటుంది. ప్రపంచంలో జరిగే విశేషాలన్నింటినీ అరచేతిలో తెలుసుకునే వీలు, గేమ్స్, ఫ్రెండ్స్‌తో చాటింగ్, మ్యూజిక్, వీడియోలు చూసుకునే వీలు.. ఇలా ఎన్నో ఫీచర్లతో లభ్యమవుతున్న స్మార్ట్‌ఫోన్‌లకు నేటి యువతే కాకుండా పెద్దలూ బానిసలుగానే మారిపోతున్నారు. అయితే, స్మార్ట్‌ఫోన్‌లలో ఉపయోగిస్తోన్న యాప్‌లపై ‘ఫ్లూర్రీ ఎనలైటిక్స్’ అనే సంస్థ ఓ సర్వే నిర్వహించి పలు విషయాలు తెలిపింది.
భారత్ లో మొత్తం 147 మిలియన్ డివైస్‌లలో 58వేల రకాల యాప్‌లు వినియోగంలో ఉన్నాయని ఆ సర్వే ద్వారా తెలిసింది. వీటిలో అధికశాతం మంది యూజర్లు ఎంటర్‌టైన్మెంట్ సంబంధిత యాప్‌లే వాడుతున్నారు. మ్యూజిక్ యాప్‌లకు యూజర్లకు అత్యధికంగా ప్రాధాన్యతనిస్తోంటే ఆ తరువాత వరుసగా బిజినెస్- ఫైనాన్స్, యుటిలిటీస్- ప్రొడక్టివిటీ, ఫొటోగ్రఫీ, మెసేజ్-సోషల్, హెల్త్-ఫిట్‌నెస్, న్యూస్-మ్యాగజైన్స్, లైఫ్‌స్టైల్- షాపింగ్, గేమ్స్ కు చెందిన యాప్‌లు ఉన్నాయి.