: ఉప్పు తగ్గించండి...అర్ధరాత్రి బాత్రూమ్ కి వెళ్లాల్సిన అవసరం రాదు: శాస్త్రవేత్తలు


అనారోగ్యంతో ఉన్నప్పుడు కూరల్లో ఉప్పు తగ్గించమని వైద్యులు సూచిస్తుంటారన్న సంగతి తెలిసిందే. ఉప్పు తక్కువ తీసుకుంటే శరీరానికి మేలని, అసలు మనం తీసుకునే ప్రతి ఆహారంలో కాస్త పరిమాణంలో ఉప్పు ఉంటుందని పరిశోధకులు పలు సందర్భాల్లో చెబుతుంటారు. అయితే కొంత మందికి అర్ధ రాత్రి బాత్రూంకి వెళ్లే అలవాటు ఉంటుంది. ఇది కొంతమందిని ఇబ్బంది పెడుతుంది. అలాంటి వారి కోసం టోక్యోలోని నాగసాకి యూనివర్సిటీ పరిశోధకులు చేసిన పలు పరిశోధనలు ఉపశమనం ఇస్తాయి. ఉప్పు వాడకాన్ని తగ్గిస్తే రాత్రిపూట నిద్రలో నుంచి లేవాల్సిన అవసరం తగ్గుతుందని వారు చేసిన పరిశోధనల్లో తేలింది. 223 మంది వలంటీర్లపై జరిపిన పరిశోధనలో ఈ విషయం రుజువైందని వారు తెలిపారు. ఉప్పు తక్కువగా తీసుకుంటే నిద్రలో లేవాల్సిన అవసరం ఉండదని వారు తెలిపారు. 

  • Loading...

More Telugu News