: తెలంగాణ శాసనసభ నిరవధిక వాయిదా
తెలంగాణ శాసనసభ బడ్జెట్ సమావేశాలు ముగిశాయి. సమావేశాలను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ మధుసూదనా చారి పేర్కొన్నారు. సభలో ఈ రోజు ద్రవ్య వినిమయ బిల్లు, కాగ్ రిపోర్టులను ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ ప్రవేశపెట్టారు. వీటిపై అధికార, విపక్ష సభ్యులు చర్చించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ... హోంగార్డులు, ఆశా వర్కర్లు, బీసీల రిజర్వేషన్లు తదితర అంశాలపై మాట్లాడారు.