: విమానయాన సంస్థల తీరుకు నిరసనగా మహారాష్ట్ర బంద్ నిర్వహిస్తున్న శివసేన


విమానంలో తనకు సరైన సీటు కేటాయించలేదనే కోపంతో ఎయిర్ లైన్స్ సిబ్బందిపై శివసేన ఎంపీ రవీంద్ర గైక్వాడ్ దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, ఆయనను విమానం ఎక్కించే ప్రసక్తే లేదని విమానయాన సంస్థలు తేల్చి చెప్పాయి. దీంతో, ఆయన రైల్లోనే ప్రయాణిస్తున్నారు. అయితే, తప్పు చేసిన తమ ఎంపీని వారించాల్సింది పోయి... ఆయనేదో గొప్ప పని చేసినట్టు శివసేన మహారాష్ట్ర బంద్ కు పిలుపునిచ్చింది. ఉస్మానాబాద్ సహా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో బంద్ సంపూర్ణంగా జరుగుతోంది. 

  • Loading...

More Telugu News