: ఐదు వికెట్లు కోల్పోయిన ఆసీస్
ధర్మశాల వేదికగా టీమిండియాతో జరుగుతున్న చివరిటెస్టు మ్యాచులో రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేస్తోన్న ఆస్ట్రేలియా ఐదు వికెట్లు కోల్పోయింది. వార్నర్ 6, స్మిత్ 17, రెన్షా 8 పరుగులు చేసి అవుటయిన విషయం తెలిసిందే. అనంతరం క్రీజులోకి వచ్చిన కాంబ్ 18 పరుగులకి అవుట్ కాగా కొద్దిసేపటికే మార్ష్ 1 పరుగుకే వెనుదిరిగాడు. ప్రస్తుతం గ్లెన్ మాక్స్ వెల్ 37 పరుగులతో వుండగా, క్రీజులోకి వేడ్ వచ్చాడు. ఆసీస్ ప్రస్తుతం ఐదు వికెట్ల నష్టానికి 92 పరుగులతో క్రీజులో ఉంది. టీమిండియా బౌలర్లలో భువనేశ్వర్ కుమార్, అశ్విన్, జడేజాలకు చెరో వికెట్ దక్కగా, ఉమేష్ కు రెండు వికెట్లు దక్కాయి.