: మధ్యప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం.. 12 మంది దుర్మరణం.. 30 మందికి గాయాలు
మధ్యప్రదేశ్ జబల్పూర్లోని నీచీ అనే గ్రామంలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 12 మంది మృతి చెందగా, మరో 30 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న సహాయక బృందాలు అక్కడకు చేరుకొని క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలిస్తున్నాయి. నీచీ గ్రామంలో కూలీలను తీసుకెళ్తున్న మినీ ట్రక్కు అదుపుతప్పి బోల్తా పడడంతో ఈ ప్రమాదం సంభవించిందని అక్కడి పోలీసులు తెలిపారు. ప్రమాద సమయంలో సదరు ట్రక్కు డ్రైవర్ బయటకు దూకేసి అక్కడి నుంచి పారిపోయాడని తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు ఆరా తీస్తున్నారు.