: రాజమౌళి, పవన్ కల్యాణ్ కలిస్తేనా..: రామ్ గోపాల్ వర్మ


పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తాజా చిత్రం 'కాటమరాయుడు' విడుదలైన వేళ, బాహుబలి రెండో భాగం ప్రీ రిలీజ్ వేడుక వైభవంగా జరగడంపై దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తనదైన శైలిలో స్పందించాడు. "రాజమౌళి, పవన్ కల్యాణ్ కలిసి ఓ చిత్రాన్ని తీస్తే, అది బాక్స్ ఆఫీస్ రికార్డులన్నీ బద్దలు కొడుతుంది. ఓ అభిమానిగా అది సాధ్యమైనంత త్వరగా జరగాలని నేను కోరుకుంటున్నాను" అని తన సోషల్ మీడియా మాధ్యమం ట్విట్టర్ లో వ్యాఖ్యానించాడు. ఈ ట్వీట్ వందల సంఖ్యలో షేర్లను, వేల సంఖ్యలో లైక్స్ ను తెచ్చుకుని వైరల్ అయింది.

  • Loading...

More Telugu News