: ఆదిలోనే మూడు వికెట్లు కోల్పోయిన ఆసీస్
ఇండియాకు భారీ ఆధిక్యాన్ని ఇవ్వలేదన్న ఆస్ట్రేలియా ఆనందాన్ని కాసేపటికే ఆవిరి చేస్తూ, రెండో ఇన్నింగ్స్ లో కీలకమైన మూడు వికెట్లను భారత బౌలర్లు పడగొట్టారు. ఓపెనర్ వార్నర్ వికెట్ ను యాదవ్ తీయగా, కెప్టెన్ స్మిత్ వికెట్ ను భువనేశ్వర్ కుమార్, ఆపై రెన్షా వికెట్ ను ఉమేష్ పడగొట్టాడు. వార్నర్ 6 పరుగులకు, స్మిత్ 17 పరుగులకు అవుట్ కాగా, రెన్షా 8 పరుగులు చేసి పెవీలియన్ దారి పట్టాడు. దీంతో, 9.2 ఓవర్లలోనే 31 పరుగులకు మూడు వికెట్లను కోల్పోయి ఆ జట్టు కష్టాల్లో పడ్డట్లయింది. ప్రస్తుతం హ్యాండ్స్ కాంబ్, గ్లెన్ మాక్స్ వెల్ ఆడుతున్నారు.