: శాంసంగ్ గెలాక్సీ ఎస్-8... ఎలా ఉందంటే..!


ఈ వారంలో మార్కెట్లోకి రానున్న శాంసంగ్ ఫ్లాగ్ షిప్ స్మార్ట్ ఫోన్లు ఎస్8, ఎస్8 ప్లస్ ఫీచర్లు, స్పెసిఫికేషన్స్ తదితరాలు ఆన్ లైన్లో లీక్ అయ్యాయి. ఆన్ లైన్లో చక్కర్లు కొడుతున్న వివరాల ప్రకారం, ఎస్8 5.8 అంగుళాలు, ఎస్8 ప్లస్ 6.2 అంగుళాల స్క్రీన్ సైజులో ఉంటాయి. రెండు ఫోన్లలో ఐరిస్ స్కానర్, బయో మెట్రిక్ అథెంటికేషన్ ఫీచర్లు ప్రధాన ఆకర్షణ. ముందు కెమెరాకు ఐరిస్ స్కానర్ ను జోడించినట్టు తెలుస్తోంది. దీంతో పాటు ఫేస్ రికగ్నిషన్ టెక్నాలజీతో ఈ ఫోన్లు ఉంటాయి.

కర్వ్ డ్ డిస్ ప్లే, క్వాడ్ హెచ్ డీ అమోలెడ్ డిస్ ప్లే, ఫింగర్ ప్రింట్ సెన్సార్, 12 ఎంపీ రేర్, 8 ఎంపీ సెల్ఫీ కెమెరాలు, క్వాల్ కాం స్నాప్ డ్రాగెన్ 835 చిప్ సెట్, 4 జీబీ/6జీబీ రామ్, ఆండ్రాయిడ్ 7.0 నౌగాట్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటాయని తెలుస్తోంది. ఇక వీటి ధర విషయానికి వస్తే, రూ. 61 వేల నుంచి రూ. 69 వేల నడుమ ఉంటాయని సమాచారం. 28న ఈ ఫోన్లు ఎంపిక చేసిన కొన్ని దేశాల్లో విడుదల కానుండగా, ఇండియాలో ఎప్పుడు విడుదల చేస్తామన్న విషయాన్ని శాంసంగ్ ఇంకా ప్రకటించలేదు.

  • Loading...

More Telugu News