: ఐపీఎల్ మ్యాచ్ లో చీర్ లీడర్లు ఉండడం ఆ ముఖ్యమంత్రికి ఇష్టముండదు!: దిగ్విజయ్ సింగ్ చురకలు
త్వరలో ప్రారంభం కానున్న ఐపీఎల్‌లో మూడు మ్యాచులు మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో జరుగన్నాయి. అయితే, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అక్కడ జరిగే మూడు మ్యాచ్ లకు వినోద పన్ను మినహాయింపును ఇచ్చేందుకు నిరాకరించడంతో కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ ఆయనకు చురకలంటించారు. క్రీజులో బ్యాట్స్ మెన్ సిక్సులు, ఫోర్లు కొట్టే సమయంలో చీర్ లీడర్స్ వేసే డ్యాన్స్ లు అభిమానులను అలరిస్తాయన్న విషయం తెలిసిందే. అయితే, మ్యాచులో చీర్ లీడర్లు ఉండడం ఆ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఇష్టముండదని దిగ్విజయ్ అన్నారు. అందుకే ఐపీఎల్ మ్యాచులకు పన్ను మినహాయింపును ఇవ్వడం లేదని, అయితే చీర్ లీడర్లకు బదులు రాముడి పాటలు వేస్తే మాత్రం ఆయన పన్ను మినహాయింపు ఇచ్చేవారని సెటైర్ వేశారు. బ్యాట్స్ మెన్ ఫోర్లు, సిక్స్ లు కొట్టినప్పుడు, వికెట్లు పడినప్పుడు రాముడి పాటలు వేస్తే బాగుంటుందని ఆయన చమత్కరించారు.