: ధోనీని కెప్టెన్ గా తొలగించిన పుణె ఐపీఎల్ ఫ్రాంచైజీ... ఇప్పుడు పేరునూ మార్చుకుంది!


మరో వారంలో 10వ విడత ఐపీఎల్ పోటీలు ప్రారంభం కానున్న వేళ, ఇప్పటికే మహేంద్ర సింగ్ ధోనీని కెప్టెన్సీ పదవి నుంచి తొలగించి, ఆ బాధ్యతలను స్టీవ్ స్మిత్ కు అప్పగించిన పుణె ఫ్రాంచైజీ, ఇప్పుడు జట్టు పేరులో స్వల్ప మార్పును చేసుకుంది. ఇకపై తమ జట్టు పేరు 'పుణె సూపర్ జెయింట్స్' కాదని 'పుణె సూపర్ జెయింట్'గా మార్చుకున్నామని జట్టు అధికార ప్రతినిధి మీడియాకు తెలిపారు. గత సంవత్సరం జట్టులో కనీసం నలుగురు లేదా ఐదుగురు ఆటగాళ్లు సూపర్ జెయింట్స్ గా ఉండాలని భావించామని, ఈ సంవత్సరం టీమ్ మొత్తం ఆ స్థాయిలో ఉన్నందునే 'సూపర్ జెయింట్'గా పేరు మార్చుకున్నామని తెలిపారు. కాగా, గత సీజనులో పుణె జట్టు తానాడిన 14 మ్యాచ్ లలో ఐదు గెలిచి, తొమ్మిది ఓడిపోయి, 7వ స్థానంలో నిలిచిన సంగతి తెలిసిందే. కాగా, పుణె జట్టు తన తొలి మ్యాచ్ ని ఏప్రిల్ 6న ముంబై ఇండియన్స్ తో ఆడనుంది.

  • Loading...

More Telugu News