: ఆధార్ అనుసంధానం తప్పనిసరి కాదు: మరోసారి స్పష్టం చేసిన సుప్రీంకోర్టు
అక్రమాలను తొలగించడానికి అన్ని సంక్షేమ పథకాలకు కేంద్ర ప్రభుత్వం ఆధార్ కార్డును తప్పనిసరి చేస్తూ ఆదేశాలు జారీ చేస్తోన్న విషయం తెలిసిందే. అయితే, సుప్రీంకోర్టు మాత్రం ఆధార్ అనుసంధానం తప్పనిసరి కాదని మరోసారి తేల్చి చెప్పింది. కేవలం బ్యాంక్ అకౌంట్లు తెరవడంలాంటి వాటికి ఆధార్‌ను వాడుకోవచ్చని సూచించింది. పథకాలకు ఆధార్ అనుసంధానం అంశాన్ని సవాలు చేస్తూ దాఖలయ్యే పిటిషన్లపై ఈ రోజు మరోసారి విచారణ జరిపిన సుప్రీంకోర్టు అందుకు ఏడుగురు జడ్జిల ధర్మాసనాన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని, ఇప్పట్లో అది సాధ్యం కాదని తెలిపింది. ఇటీవలే కేంద్ర ప్రభుత్వం ఓ ప్రకటన జారీ చేస్తూ తాము అందిస్తోన్న 30కిపైగా ఉన్న కేంద్ర సంక్షేమ పథకాల లబ్ధి పొందాలంటే తప్పనిసరిగా ఆధార్ అనుసంధానం చేయాల్సిందేనని తెలిపింది.