: చంద్రబాబుది ముఖ్యమంత్రి స్థాయా? లేక పంచాయతి స్థాయా?: రోజా


ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అక్రమాలకు, అరాచకాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిందని వైసీపీ ఎమ్మెల్యే రోజా ఆరోపించారు. తెలుగుదేశం పార్టీకి చెందిన రౌడీ ఎమ్మెల్యేలను సీఎం చంద్రబాబు వెనకేసుకొస్తున్నారని మండిపడ్డారు. రాజధానిని రౌడీలకు అడ్డాగా చంద్రబాబు మార్చేశారని విమర్శించారు. చంద్రబాబు ముఖ్యమంత్రా? లేక పంచాయతీ స్థాయి నాయకుడా? అంటూ ప్రశ్నించారు. నిజాయతీపరుడైన అధికారిగా పేరు తెచ్చుకున్న సుబ్రహ్మణ్యంపై టీడీపీ నేతలు దాడి చేయడం సిగ్గుచేటని రోజా అన్నారు.

  • Loading...

More Telugu News