: టీమిండియా ఆలౌట్... లీడ్ కేవలం 32 పరుగులే


ధర్మశాలలో జరుగుతున్న నాలుగో టెస్టులో భారత జట్టు 332 పరుగులకు ఆలౌటై, ఆస్ట్రేలియాపై తొలి ఇన్నింగ్స్ లో 32 పరుగుల లీడ్ ను నమోదు చేసింది. భారత ఆటగాళ్లలో హాఫ్ సెంచరీలు సాధించిన వారు ముగ్గురు ఉన్నప్పటికీ, వారు తమ స్కోరును సెంచరీ దాటించలేకపోవడంతోనే సంతృప్తికర లీడ్ నమోదు కాలేదు. రాహుల్ 60, విజయ్ 11, పుజారా 57, రహానే 46, నాయర్ 5, అశ్విన్ 30, సాహా 31, జడేజా 63, కుమార్ 0, కుల్ దీప్ 7 పరుగులకు అవుట్ కాగా, యాదవ్ 2 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. భారత జట్టు ఆలౌట్ తరువాత అంపైర్లు, భోజన విరామాన్ని ప్రకటించారు. లంచ్ బ్రేక్ తరువాత ఆస్ట్రేలియా తన రెండో ఇన్నింగ్స్ ను ప్రారంభించనుంది.

  • Loading...

More Telugu News