: అస్వస్థతకు గురైన అగ్రిగోల్డ్‌ ఛైర్మన్‌, ఎండీ... ఆసుపత్రికి తరలింపు


అగ్రిగోల్డ్ ఛైర్మన్‌ అవ్వా వెంకట రామారావు, ఎండీ శేష నారాయణలు ఈ రోజు ఉద‌యం అస్వస్థతకు గురికావ‌డంతో వారిని పోలీసులు ఆసుపత్రికి త‌ర‌లించారు. ప్ర‌స్తుతం వారిరువురికీ ఏలూరు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స కొన‌సాగుతోంది. అయితే, మెరుగైన చికిత్స కోసం వారిని విజయవాడకు తరలిస్తామ‌ని అధికారులు చెబుతున్నారు. త‌మ సంస్థ‌లో డిపాజిట్లు చేసుకున్న వేలాది మందిని అగ్రిగోల్డ్ మోసం చేసిన విష‌యం తెలిసిందే. ఈ కేసులో వెంకట రామారావు, శేష నారాయణలు అరెస్ట‌యి ఏలూరు స‌బ్‌జైలులో ఉంటున్నారు.

  • Loading...

More Telugu News