: ఆదిత్య చోప్రాతో ఎలాంటి విభేదాలు లేవు : అనుష్క శర్మ


బాలీవుడ్ బ్యూటీ అనుష్క శర్మ కూడా సినీ నిర్మాణరంగంలోకి దిగిన విషయం తెలిసిందే. అయితే, తనకు సినీ అవకాశాలిచ్చిన యశ్‌రాజ్‌ ఫిలింస్‌ అధినేత ఆదిత్య చోప్రాతో అనుష్కకు వివాదాలు తలెత్తాయని బాలీవుడ్‌లో ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ విష‌యంపై స్పందించిన అనుష్క శ‌ర్మ ఆ ప్ర‌చారాన్ని కొట్టిపారేసింది. యశ్‌రాజ్‌ బ్యానర్‌తో తనకు ఎలాంటి వివాదాలు లేవని, ఆ సంస్థ‌ టాలెంట్‌ను ప్రోత్సహిస్తుంటుంద‌ని పేర్కొంది.

త‌న‌ నటనను కూడా ఆ సంస్థ పెద్ద‌లు ప్రోత్సహించారని తెలిపింది. తాను చాలా సంవత్సరాలుగా ఆదిత్యచోప్రాతో కలిసి పనిచేశాన‌ని, అయితే, నిర్మాతగా మారాలనే ఆలోచన వచ్చినప్పుడు ఆదిత్యకు ఫోన్‌ చేసి అతని అనుమతిని తీసుకోలేదని చెప్పింది. తాము మామూలుగా క‌లుసుకున్న‌ప్పుడు అతనికి ఈ విష‌యాన్ని చెప్పాన‌ని తెలిపింది. అది వినగానే ఆయ‌న త‌న‌ ఆలోచన బావుందని ప్రశంసించారని, ఆదిత్య త‌న‌కు చాలా సినిమాలు ఆఫర్‌ చేశారని, కానీ తాను కేవలం త‌న‌కు నచ్చిన సినిమాల్లో మాత్రమే నటించాన‌ని తెలిపింది.

  • Loading...

More Telugu News