: సిద్ధరామయ్య నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు... పరువునష్టం దావా వేస్తా: యెడ్యూరప్ప


కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యపై మాజీ సీఎం, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు యెడ్యూరప్ప నిప్పులు చెరిగారు. తాను నిర్దోషినని కోర్టులు తీర్పులు వెలువరించినా.... జైలుకు పోయి వచ్చాడని, పలు కేసులు ఉన్నాయంటూ బహిరంగ సమావేశాల్లో తనపై పదేపదే సిద్ధరామయ్య ఆరోపణలు చేస్తున్నారంటూ యెడ్డీ మండిపడ్డారు. తనపై కేసులను కోర్టులు కొట్టివేసినప్పటికీ... సిద్ధరామయ్య నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాగే మాట్లాడుతూ పోతే సిద్ధరామయ్యపై పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరించారు. దేశంలోనే అత్యంత అవినీతిపరుడైన నాయకుడు సిద్ధరామయ్యే అని ఆరోపించారు. దమ్ముంటే డైరీల కుంభకోణంపై సీబీఐతో విచారణ జరిపించాలని సవాల్ విసిరారు.

  • Loading...

More Telugu News