: మా వాళ్లు చేసిన దాడి చాలా చిన్న విషయం: చీఫ్ విప్ కాల్వ
రవాణాశాఖ అధికారులపై టీడీపీ నేతలు కేశినేని నాని, బొండా ఉమామహేశ్వరరావులు చేసిన దాడి చాలా చిన్న విషయమని ప్రభుత్వ చీఫ్ విప్ కాల్వ శ్రీనివాసులు అన్నారు. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రతి చిన్న విషయాన్ని వైసీపీ నేతలు రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు. తమ వాళ్లు ఆల్రెడీ సారీ చెప్పేశారని... దీంతో, ఈ వివాదం ముగిసిపోయిన అంశమని చెప్పారు.
అంతకు ముందు వైసీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ, అధికారులపై టీడీపీ నేతలు కక్ష సాధింపు ధోరణిని అవలంబిస్తున్నారని ఆరోపించారు. అధికారులపై దాడులు రోజురోజుకూ పెరుగుతున్నాయని అన్నారు. టీడీపీ నేతలు రౌడీయిజం చేస్తున్నారంటూ మండిపడ్డారు.