: ఈ సెటిల్ మెంట్ల సీఎం మాకొద్దు... బాబు రాజీనామాకు రోజా డిమాండ్


నవ్యాంధ్ర రాజధాని అమరావతి ప్రాంతం రౌడీయిజానికి అడ్డాగా మారిపోయిందని వైకాపా శాసన సభ్యురాలు రోజా ఆరోపించారు. ఈ ఉదయం అసెంబ్లీలో మీడియాతో మాట్లాడిన ఆమె, చంద్రబాబు సెటిల్ మెంట్ల సీఎం అయిపోయారని, ఇటువంటి సీఎం తమకు వద్దని, ఆయన వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఆర్టీయే అధికారిపై దాడి చేసిన సొంత పార్టీ నేతలను ఆయన వెనకేసుకొస్తున్నారని నిప్పులు చెరిగారు. వారు చేసిన తప్పులపై అధికారులతో మాట్లాడి సెటిల్ మెంట్లు చేస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు చీఫ్ మినిస్టర్ కాదని, చీప్ మినిస్టర్ గా మారిపోయారని ఎద్దేవా చేశారు. గతంలో ఎమ్మార్వో వనజాక్షి, టీడీపీ మహిళా నేత జానీమూన్ విషయంలోనూ ఆయన ఇదే విధమైన సెటిల్ మెంట్లకు పాల్పడ్డారని ఆరోపించారు.

  • Loading...

More Telugu News