: అధికారిని కొట్టిన ఎంపీని వెనకేసుకొస్తూ, ఎయిర్ ఇండియాపై లోక్ సభలో శివసేన ప్రివిలేజ్ మోషన్!


విమానంలో ఎయిర్ ఇండియా ఉద్యోగిని చెప్పుతో కొట్టి తీవ్ర విమర్శలను ఎదుర్కొని, ఆపై అన్ని విమానయాన సంస్థల నిషేధాన్ని ఎదుర్కొంటున్న ఎంపీ రవీంద్ర గైక్వాడ్ ను శివసేన వెనకేసుకొచ్చింది. ఘటనలో ఆయన తప్పేమీ లేదని చెబుతూ, ఎయిర్ ఇండియాపై లోక్ సభలో హక్కుల తీర్మానాన్ని ప్రవేశపెట్టాలని నిర్ణయించుకుంది. తమ ఎంపీని నిషేధించడంపై లోక్ సభ దృష్టికి తీసుకు రానున్నామని, బీజేపీ కూడా ఈ విషయంలో తమకు అండగా ఉందని పార్టీ నేత ఒకరు తెలిపారు. కాగా, గత గురువారం నాడు తనకు బిజినెస్ క్లాస్ సీటును ఇవ్వలేదన్న కారణాన్ని చూపుతూ పుణె - న్యూఢిల్లీ విమానంలో డ్యూటీ మేనేజరుపై గైక్వాడ్ అత్యంత అనుచితంగా ప్రవర్తించిన సంగతి తెలిసిందే. దీనిపై ఎయిర్ ఇండియా క్షమాపణలు కోరగా, తాను చెప్పేదిలేదని గైక్వాడ్ స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News