: టాలీవుడ్ పై తాప్సీ తీవ్ర వ్యాఖ్యలు... సోషల్ మీడియాలో దుమారం!
టాలీవుడ్ లో కొనసాగుతున్న ఓ దుష్ట సంప్రదాయంపై నటి తాప్పి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో విమర్శలు గుప్పించింది. ఈ ఇంటర్వ్యూ మొత్తం 'హ్యూమన్స్ ఆఫ్ బాంబే' అనే ఫేస్ బుక్ పేజ్ లో వచ్చింది. కాలేజీలో చదువుకునే రోజుల్లోనే తాను మోడలింగ్ రంగంలోకి వచ్చానని... క్యాట్ ఎగ్జామ్ లో 88 శాతం స్కోరు సాధించిన తాను పాకెట్ మనీ కోసం సరదాగా నటనవైపు అడుగు వేశానని ఇంటర్వ్యూలో చెప్పింది.
అనుకోకుండా టాలీవుడ్ లోకి అడుగుపెట్టానని... అయితే, తాను నటించిన మొదటి మూడు సినిమాలు బాగా ఆడలేదని... దీంతో, తనపై ఐరన్ లెగ్ ముద్ర వేశారని ఆమె విమర్శించింది. అప్పట్నుంచి సినిమాలో తనను పెట్టుకోవడమే తప్పు అనే విధంగా దుష్ప్రచారం చేశారని వాపోయింది. సినిమా ఆడకపోతే, హీరోయిన్ పై ఐరన్ లెగ్ అనే ముద్ర వేయడం టాలీవుడ్ లో ఎన్నేళ్లుగానో సాగుతోందని ఆమె మండిపడింది. ఈ ఇంటర్వ్యూ ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశం అయింది. ఇంటర్వ్యూ వైరల్ అవుతోంది. ఈ ఇంటర్వ్యూకు వేలాదిగా కామెంట్లు వస్తున్నాయి. జాతీయ మీడియాలో సైతం ఈ ఇంటర్వ్యూ చర్చనీయాంశం కావడంతో, కొందరు సాటి టాలీవుడ్ హీరోయిన్లు కూడా... 'అవును ఇది నిజమే' అని ప్రకటిస్తున్నారు.
<iframe src="https://www.facebook.com/plugins/post.php?href=https%3A%2F%2Fwww.facebook.com%2Fhumansofbombay%2Fposts%2F626422330900081%3A0&width=500" width="500" height="517" style="border:none;overflow:hidden" scrolling="no" frameborder="0" allowTransparency="true"></iframe>