: బిగ్ 'బాహుబలి' సెల్ఫీ... చూశారా?
'బాహుబలి: ది కన్ క్లూజన్' ప్రీ రిలీజ్ ఈవెంట్ అనుకున్నట్టుగానే అట్టహాసంగా, ఆడంబరంగా సాగగా, కార్యక్రమం చివర్లో చిత్ర కెమెరామెన్ సెంథిల్ కుమార్, తన సెల్ ఫోన్ కెమెరాకు పనిచెప్పాడు. స్టేజ్ మీదనే సెల్ఫీ తీశాడు. ఈ ఫోటోను బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ తన ఇన్ స్టాగ్రామ్ ఖాతా ద్వారా పంచుకున్నాడు. ఈ ఫోటోలో, రానా, ప్రభాస్, అనుష్క, తమన్నా, సత్యరాజ్, రమ్యకృష్ణ, నాజర్, కరణ్ జోహార్ లతో పాటు సెంథిల్ కుమార్, ఎంఎం కీరవాణి, రాజమౌళి, చిత్ర నిర్మాతలు, ఇతర ముఖ్య టెక్నీషియన్స్ ఉన్నారు. ఆ బిగ్ సెల్ఫీని మీరూ చూడవచ్చు.