: నేను రాక్షసుడిని... మీరూ అలాగే లేకుంటే ఇంటికే: అధికారులకు యూపీ సీఎం వార్నింగ్


పొద్దున్నే పది గంటలకో, పదకొండు గంటలకో తాపీగా ఆఫీసుకు రావడం, టీ తాగేసి, కబుర్లు చెప్పుకోవడం, మధ్యాహ్నం భోజనం, ఆపైన విసుగేస్తే, కాసేపు కునుకేసి, సాయంత్రం 5 కాగానే ఇంటికి వెళ్లిపోదామని భావించే ప్రభుత్వ ఉద్యోగులకు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఝలక్ ఇచ్చారు. నిత్యమూ 18 నుంచి 20 గంటల పాటు ఉద్యోగులు పని చేయాల్సి వుంటుందని, అలా కుదరదని అనుకుంటే రాజీనామాలు చేసి వెళ్లిపోవాలని వార్నింగ్ ఇచ్చారు.

 తాను ఓ పని రాక్షసుడినని, అధికారులూ అలాగే ఉండాలని కోరుకుంటున్నానని, కష్టపడని వారికి ఇక్కడ స్థానం ఉండదని చెప్పారు. పథకాల అమలులో నిర్లక్ష్యాన్ని సహించబోనని స్పష్టం చేశారు. మంత్రి అయినా సరే అధికారాన్ని దుర్వినియోగం చేసినట్టు తెలిస్తే చర్యలుంటాయని, ఎన్నికల హామీలను నెరవేర్చడం తమ ముందున్న తొలి కర్తవ్యమని చెప్పారు. ప్రభుత్వ పనితీరులో లోపం ఉంటే తన దృష్టికి తీసుకురావాలే తప్ప, ప్రభుత్వ కార్యకలాపాల్లో వేలు పెడితే సహించేది లేదని పార్టీ నేతలకు బుద్ధి చెప్పారు.

  • Loading...

More Telugu News