: గ్లోబల్ బిజినెస్ సమ్మిట్‌లో పాల్గొనేందుకు ఢిల్లీకి చంద్రబాబు!
ఢిల్లీలో నేడు (సోమవారం) నిర్వహించనున్న గ్లోబల్ బిజినెస్ సమ్మిట్‌లో పాల్గొనేందుకు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేడు ఢిల్లీకి వెళ్లనున్నారు. ఎస్ బ్యాంక్, ఆంధ్రప్రదేశ్ ఆర్థిక అభివృద్ధి బోర్డు (ఈడీబీ)లు కలిసి ఢిల్లీలోని తాజ్ ప్యాలెస్‌లో సంయుక్తంగా ఈ సమ్మిట్‌ను నిర్వహిస్తున్నాయి. నేటి మధ్యాహ్నం విజయవాడ నుంచి చంద్రబాబు బయల్దేరి ఢిల్లీ వెళతారు. సాయంత్రం 5 గంటల నుంచి 8.30 వరకు జరిగే సదస్సులో చంద్రబాబు పాల్గొని ప్రసంగిస్తారు.