: ఉద్యమ సమయంలో తెలంగాణను వ్యతిరేకించింది నిజమే.. మంత్రి తలసాని


తెలంగాణ ఉద్యమ సమయంలో తాను తెలంగాణను వ్యతిరేకించిన మాట వాస్తవమేనని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. అయితే రాష్ట్రం సాధించుకున్న తర్వాత ఇంత గొప్పగా ఉంటుందని ఆనాడు ఊహించలేకపోయానన్నారు. ఆదివారం సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరులో గొర్రెల కాపరులు, మత్స్యకారుల సహకార సంఘాల సమావేశం నిర్వహించారు. దీనికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఉద్యమ సమయంలో తెలంగాణను వ్యతిరేకించానని పేర్కొన్నారు. రాష్ట్ర ఏర్పాటు తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో ఇంత గొప్పగా ఉంటుందని ఊహించలేకపోయానన్నారు. రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రగామిగా తీర్చిదిద్దేందుకు కేసీఆర్ నిరంతరం కృషి చేస్తున్నారని తలసాని అన్నారు.

  • Loading...

More Telugu News