: ఆస్ట్రేలియాకూ పాకిన జాతి వివక్ష జాఢ్యం.. భారతీయుడిపై దాడి
ఇప్పటి వరకు అమెరికాకే పరిమితమైన జాత్యహంకార దాడులు ఇప్పుడు ఆస్ట్రేలియాకూ పాకాయి. వారంలో రెండోసారి భారతీయుడిపై దాడి జరిగింది. హోబర్ట్‌లో నివసిస్తున్న కేరళకు చెందిన లీ మ్యాక్స్ జాయ్‌పై శనివారం తెల్లవారుజామున కొందరు స్థానికులు దాడి చేశారు. కేరళలోని కొట్టాయం సమీపంలోని పుత్తపల్లికి చెందిన జాయ్ ఎనిమిదేళ్లగా కుటుంబంతో హోబర్ట్‌లో నివసిస్తున్నాడు. ఆటోమొబైల్ ఇంజినీర్ అయిన జాయ్ వీకెండ్స్‌లో ట్యాక్సీ నడుపుతుంటాడు. శనివారం కొందరు ఆస్ట్రేలియన్లు తనపై దాడి చేశారని, అయితే పోలీసులు కేసు నమోదు చేసుకోవడానికి వెనకాడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. నిందితులకు శిక్ష పడేవరకు తాను పోరాడతానని జాయ్ పేర్కొన్నాడు.