: ప్రభాస్ కు ఏమిచ్చానని ఆలోచించేవాడిని!: రాజమౌళి


బాహుబలి సినిమా సెట్ కు, ఆడియో ఫంక్షన్ కు సాయం చేసిన రామోజీరావు గారికి, హయత్ నగర్ పోలీసులు, కమిషనర్ మహేష్ భగవత్ గారికి ధన్యవాదాలని రాజమౌళి తెలిపారు. తన సినిమాకు పని చేసిన టెక్నీషియన్స్ చాలా అద్భుతంగా పని చేశారని అన్నారు. ఈ సందర్భంగా ప్రతి డిపార్ట్ మెంట్ ను అభినందించిన రాజమౌళి.. తన భార్యను ఇంకా ఎక్కువ పొగిడితే చెప్పిన మాట వినరని చమత్కరించాడు. ఇక యూనిట్ తన కుటుంబం లాంటిదని చెప్పాడు. ఐదేళ్లు తనతో పని చేసినందుకు సెంధిల్, సాబు సిరిల్, కనల్ కణ్ణన్, నిర్మాతలకు ధన్యవాదాలు చెప్పాడు. తమ సినిమాలో చాలా కష్టపడ్డ టీం ఏదైనా ఉందంటే అది ప్రొడక్షన్ టీమ్ అని రాజమౌళి చెప్పాడు. రాత్రి 12కి వారి పని ముగిసేదని, మళ్లీ తెల్లవారుజామున 3 గంటలకు వారు సెట్ లో సిద్ధంగా ఉండేవారని చెప్పాడు.

హీరోయిజం ఎలా ఉండాలని ఊహించేవాడినో, అలాగే చేసేవాడినని.... అయితే ప్రభాస్ కు నేను ఏం ఇచ్చాను? అని ఆలోచించే వాడినని.. కానీ, బాంబేలో ప్రభాస్ ఓ ఫంక్షన్ కు వెళ్తే... అక్కడి మీడియా బాహుబలి అంటూ ప్రభాస్ ఎంటర్ అవుతున్నప్పుడు అరిచారని, అది  చాలనిపించిందని రాజమౌళి అన్నాడు. 

  • Loading...

More Telugu News