: 'మొఘల్- ఏ- ఆజమ్' తరువాత మళ్లీ భారతీయ సినిమాను తలెత్తుకునేలా చేసిన సినిమా బాహుబలి!: కరణ్ జొహార్
హైదరాబాదులోని రామోజీ ఫిల్మ్ సిటీలోని బాహుబలి- ది కన్ క్లూజన్ ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు కరణ్ జొహార్ మాట్లాడుతూ, ఇండియన్ సినిమాకు బాహుబలి చాలా విలువైన ప్లాట్ ఫాం అని అన్నాడు. అలాంటి బాహుబలి వేదికపై మాట్లాడడం తనకు గర్వంగా ఉందన్నాడు. బాహుబలి సినిమా భారతీయ సినిమాను గర్వపడేలా చేసిందని చెప్పాడు. మొఘల్- ఏ- ఆజమ్ సినిమా తరువాత మళ్లీ భారతీయ సినిమాను తలెత్తుకునేలా చేసిన సినిమా బాహుబలి అని కరణ్ జొహార్ అభిప్రాయపడ్డాడు. సరిగ్గా 68 ఏళ్ల తరువాత మొఘల్ ఏ ఆజమ్ లాంటి బాహుబలి రావడం గొప్పవిషయమని కరణ్ చెప్పాడు. నాలుగేళ్ల కాలాన్ని ఒక దర్శకుడికి నటులు ఇచ్చేశారంటే వారికి ఎంత నిబద్ధత ఉందో ఊహించవచ్చని కరణ్ అన్నాడు. ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా చూపిన నిబద్ధత గొప్పదని కరణ్ ప్రశంసించాడు. ఈ సినిమాను ధర్మాప్రొడక్షన్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం గర్వంగా ఉందని తెలిపాడు.