: గతంలో తెలుగు సినిమా గురించి మాట్లాడేవారే కాదు!: కెమెరా మెన్ సెంధిల్


తాను కళాశాలలో చదువుకునే సమయంలో తమిళ్, బెంగాలీ, మరాఠీ, పంజాబీ ఇలా ఎన్నో భాషల సినిమాలు చూపించేవారని బాహుబలి సినిమా కెమెరా మెన్ కేకే.సెంథిల్ కుమార్ తెలిపారు. హైదరాబాదులోని రామోజీ ఫిల్మ్ సిటీలో నిర్వహించిన బాహుబలి 2 ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో ఆయన మాట్లాడుతూ, ఎన్నో సినిమాలు చూశానని అన్నారు. అయితే ఎప్పుడూ తెలుగు సినిమా గురించి ప్రస్తావించలేదని అన్నారు.

తెలుగు సినిమా అంటే అంత గొప్ప పేరు లేదని ఆయన చెప్పారు. అయితే ఇప్పుడు ప్రపంచంలో ఏ మూలకెళ్లినా బాహుబలి సినిమా గురించి మాట్లాడుతున్నారని ఆయన అన్నారు. తెలుగు సినిమా స్థాయి పెరిగిందని చెప్పడానికి ఇంతకంటే నిదర్శనం ఏంటని సెంథిల్ ప్రశ్నించారు. ఈ సినిమా పూర్తయిందని, ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో పాల్గొంటున్నామంటే కాలేజీలో పోస్టు గ్రాడ్యుయేషన్ సెర్మనీలో పాల్గొంటున్నట్టు ఉందని ఆయన అన్నారు. 

  • Loading...

More Telugu News