: నాలుగు వారాల క్రితం కేటీఆర్, నేను కలసి డిన్నర్ చేశాం.. చాలా విషయాలు మాట్లాడుకున్నాం!: పవన్ కల్యాణ్
తెలంగాణ ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ కాటమరాయుడు సినిమాను ప్రశంసిస్తూ చేసిన ట్వీట్ కు ప్రముఖ నటుడు పవన్ కల్యాణ్ స్పందించారు. కాటమరాయుడు సినిమా చూసి అభినందించినందుకు కేటీఆర్ కు పవన్ కల్యాణ్ ధన్యవాదాలు తెలిపారు. ఎన్నోసార్లు కేటీఆర్, తాను కలవాలనుకున్నామని, కానీ తమ ఇద్దరి బిజీ షెడ్యూల్స్ వల్ల ఎట్టకేలకు నాలుగు వారాల క్రితం కుదిరిందని ఆయన తెలిపారు. నాలుగు వారాల క్రితం కలసి డిన్నర్ చేశామని ఆయన చెప్పారు. ఈ సందర్భంగా రాజకీయాలు, ఇష్టాయిష్టాలు, అభిరుచులు, చేనేత వస్త్రాలపై ఉన్న మక్కువ తదితర అంశాలపై మాట్లాడుకున్నామని ఆయన తెలిపారు. ఆ సమయం చాలా అద్భుతంగా గడిచిందని ఆయన చెప్పారు.