: రాజమౌళి నాకు కొత్త పేరు పెట్టాడు.. ఎక్కడికి వెళ్లినా అదే పేరుతో పిలుస్తున్నారు: సత్యరాజ్


ప్రముఖ దర్శకుడు రాజమౌళి తనకు కొత్త పేరు పెట్టారని ప్రముఖ నటుడు సత్యరాజ్ తెలిపారు. హైదరాబాదులోని రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతున్న 'బాహుబలి 2 ది కన్ క్లూజన్' సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తానింత వరకు సత్యరాజ్ గానే అందరికీ తెలుసని అన్నారు. అయితే 'బాహుబలి' సినిమా విడుదల అనంతరం తాను 'కట్టప్ప'నైపోయానని అన్నారు. ఈ పేరుతోనే తనను చాలా మంది గుర్తిస్తున్నారని ఆయన చెప్పారు. ఎక్కడికి వెళ్లినా 'కట్టప్ప' అంటున్నారని ఆయన ఆనందం వ్యక్తం చేశారు. ఆఖరుకి ఈ సినిమా యూనిట్ కూడా తనను 'కట్టప్ప' పేరుతోనే పిలిచేవారని ఆయన గుర్తుచేసుకున్నారు. 'కట్టప్ప' సార్ షాట్ రెడీ అంటూ పిలిచేవారని ఆయన చెప్పారు. రాజమౌళి పెట్టిన పేరు కూడా బాగానే ఉందని ఆయన తెలిపారు. 

  • Loading...

More Telugu News