: నువ్వు వీధిలో అరిచే కుక్కలాంటోడివి... నువ్వు పిచ్చాసుపత్రిలో చేరాలి!: రాంగోపాల్ వర్మపై బండ్ల గణేష్ ఫైర్


ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సినీ పరిశ్రమలో పవన్ కల్యాణ్ భక్తుడిగా పరిగణించుకునే నిర్మాత బండ్ల గణేష్ రాంగోపాల్ వర్మపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తాడు. ట్విట్టర్ వేదికగా రాంగోపాల్ వర్మపై ట్వీట్ల యుద్ధం ప్రకటించాడు.

ఈ సందర్భంగా 'మిస్టర్ రామూ, నీ నోటిని అదుపులో పెట్టుకో.... పవన్ కల్యాణ్ కాలికి వేసుకునే చెప్పు పాటి విలువ కూడా చెయ్యవు' అంటూ రాంగోపాల్ వర్మను బండ్ల గణేష్ విమర్శించాడు. 'వీధిలో అరిచే కుక్కలాంటోడివి.. నువ్వు నల్లగొర్రెవు...అసలు నువ్వు భారతీయుడివని చెప్పుకునేందుకే సిగ్గేస్తోంది. నువ్వు ఎక్సపైర్ అయిపోయిన టాబ్లెట్ లాంటోడివి.... నువ్వు పిచ్చాసుపత్రిలో చేరాలి... నువ్వు మా ఏరియాలో ఎంటర్ అయితే క్షమించం' అంటూ వరుస ట్వీట్లలో వర్మపై మండిపడ్డాడు.

  • Loading...

More Telugu News