: రెండో కుమార్తె పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్న పవన్ కల్యాణ్


ప్రముఖ నటుడు పవన్ కల్యాణ్ తన రెండవ కుమార్తె పౌలేనా పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొన్నాడు. కాటమరాయుడు సినిమా విడుదలకు ముందురోజు తన పెద్ద కుమార్తె ఆద్య పుట్టిన రోజు వేడుకల కోసం పూణే వెళ్లిన సంగతి తెలిసిందే. అనంతరం పవన్ కల్యాణ్ నేడు తన చిన్న కుమార్తె పౌలేనా పుట్టిన రోజు వేడుకలో పాల్గొన్నాడు. రష్యాకు చెందిన అన్నా లెజ్నోవాను మూడో వివాహం చేసుకున్న పవన్ కల్యాణ్ కు పౌలేనా జన్మించిన సంగతి తెలిసిందే. ఇక ఏప్రిల్ 8న ఏకైక కుమారుడు అకీరా పుట్టిన రోజు రానుంది. ఈ వేడుకకు కూడా పవన్ కల్యాణ్ పూణే వెళ్లే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. అనంతరం పవన్ కల్యాణ్ తన కొత్త సినిమా షూటింగ్ లో పాల్గొననున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాకు త్రివిక్రమ్ దర్శకత్వం వహించనున్నాడు. 

  • Loading...

More Telugu News