: పవన్ కల్యాణ్ పై తీవ్ర విమర్శలు చేసిన రాంగోపాల్ వర్మ
రాంగోపాల్ వర్మ మరోసారి పవన్ కల్యాణ్ ను లక్ష్యంగా చేసుకుని తీవ్ర విమర్శలు చేశాడు. కాటమరాయుడు సినిమా, పవన్ కల్యాణ్ పిల్లల పుట్టిన రోజు వేడుకలపై వర్మ ట్వీట్ చేయడంపై పవన్ కల్యాణ్ అభిమానులు మండిపడుతున్నారు. ఇంతకీ ట్వీట్లలో రాంగోపాల్ వర్మ ఏమన్నాడంటే... 30 కోట్ల రూపాయలతో సినిమా తీసిన పవన్ కల్యాణ్ వంద కోట్లకు అమ్ముకుని 70 కోట్ల రూపాయలు జేబులో వేసుకుని, కుమార్తెల పుట్టిన రోజు వేడుకలు జరుపుకుంటున్నాడని, ఇదెలా ఉందంటే రోమ్ నగరం తగలబడిపోతుంటే నీరో చక్రవర్తి ఫిడేలు వాయించుకున్నట్టు ఉందని ఎద్దేవా చేశాడు. పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ అని చెప్పుకుని బయటకు తిరిగే వారే పవన్ కల్యాణ్ కు చెడ్డపేరు తెస్తున్నారని అన్నాడు. ధియేటర్ లో పేపర్లు చించకుండా, అల్లరి చేయకుండా ఉన్నవారే నిజమైన ఫ్యాన్ అని పవన్ కల్యాణ్ గుర్తించడం లేదని రాంగోపాల్ వర్మ తెలిపాడు.