: 6 వికెట్లు కోల్పోయిన భారత్... నెమ్మదిగా పట్టుబిగిస్తున్న ఆసీస్


నాలుగో టెస్టుపై ఆస్ట్రేలియా జట్టు నెమ్మదిగా పట్టుబిగిస్తోంది. ధర్మశాల వేదికగా జరుగుతున్న నాలుగో టెస్టులో ఆసీస్ బౌలర్లు ఆకట్టుకుంటున్నారు. తొలి రెండు సెషన్లలో సాగిన భారత బ్యాట్స్ మన్ ఆధిపత్యానికి మూడో సెషన్ లో అడ్డుకట్ట వేశారు. 79వ ఓవర్ లో టీమిండియా కెప్టెన్ అజింక్యా రహానే (46) ను అర్థసెంచరీ చేయకుండా అడ్డుకుని లియాన్ అవుట్ చేశాడు. అనంతరం క్రీజులో కుదురుకున్న రవి చంద్రన్ అశ్విన్ (30) ను కూడా 83వ ఓవర్ తొలి బంతికి పెవిలియన్ కు పంపాడు. దీంతో మూడో సెషన్ లో ఆస్ట్రేలియా జట్టు నాలుగు వికెట్లు తీసింది. ఈ నాలుగు వికెట్లను నాథన్ లియాన్ తీయడం విశేషం. దీంతో 84 ఓవర్లు ముగిసేసరికి టీమిండియా 6 వికెట్ల నష్టానికి 222 పరుగులు చేసింది. క్రీజులో సాహా (2) కు, జడేజా (1) జతగా ఉన్నాడు. 

  • Loading...

More Telugu News