: అమెరికాలో మరోసారి కలకలం... నైట్ క్లబ్బులో దుండగుడి కాల్పులు!


అమెరికాను ట్రంప్ నిర్ణయాలతో పాటు, జాత్యహంకార దాడులు, ఉగ్రదాడులు బెంబేలెత్తిస్తున్నాయి. అమెరికాలో మరోసారి నైట్ క్లబ్బులో దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు. అమెరికాలోని సిన్సినాటీ నగరంలోని కెల్లోగ్‌ అవెన్యూలో ఉన్న కేమియో క్లబ్‌ లో ఈసారి దుండగుడు విరుచుకుపడ్డాడు. క్లబ్బులో అంతా మైమరచి చిందులేస్తూ, మందు కొడుతూ ఆనందంగా ఉన్న వేళ... అడుగుపెట్టిన సాయుధుడైన దుండగుడు విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డాడు. దీంతో క్లబ్ లో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. దీని గురించి సమాచారమందుకున్న పోలీసులు రంగప్రవేశం చేసి, క్షతగాత్రులను ఆసుపత్రికి తరలిస్తున్నారు. కాగా, దుండగుడి వివరాలు, క్షతగాత్రుల వివరాలు తెలియాల్సి ఉంది.

  • Loading...

More Telugu News