: మనసును చదివే గాడ్జెట్ వచ్చేస్తోంది... వచ్చే నెలలో ఆవిష్కరించనున్న ఫేస్ బుక్!


సామాజిక మాధ్యమ దిగ్గజం ఫేస్ బుక్ మరో సూపర్ గాడ్జెట్ ను అభివృద్ధి చేస్తోంది. దీన్ని ధరించిన వారి మనసులో ఏముందో, అతను ఎలా ఆలోచిస్తున్నాడో పసిగట్టడమే ఈ గాడ్జెట్ స్పెషల్. వచ్చే నెలలో దీన్ని విడుదల చేస్తారని తెలుస్తోంది. గత సంవత్సరం 'బిల్డింగ్ 8' పేరిట ఓ విభాగాన్ని ఏర్పాటు చేసి స్మార్ట్ పరికరాల అభివృద్ధికి ప్లాన్ చేసిన ఫేస్ బుక్, మార్కెట్లో సంచలనం కలిగించి, మరో ట్రెండ్ ను సెట్ చేసేలా మైండ్ రీడింగ్ గాడ్జెట్ ను తయారు చేసినట్టు సమాచారం. ఏప్రిల్ లో జరిగే సంస్థ వార్షిక డెవలపర్ల సదస్సులో దీన్ని తొలిసారిగా విడుదల చేస్తారని యూఎస్ మీడియాలో వార్తలు వచ్చాయి. దీంతో పాటు ఓ డ్రోన్, అగ్ మెంటెడ్ రియాలిటీ పరికరం కూడా మార్కెట్లోకి వస్తాయని సమాచారం.

  • Loading...

More Telugu News