: పవన్ కల్యాణ్ కటీఫ్ అంటే కటీఫే మరి: బీజేపీ నేత హరిబాబు
బీజేపీతో సంబంధాలను కొనసాగించే విషయంలో జనసేన పార్టీ వ్యవస్థాపకుడు పవన్ కల్యాణ్, తన కిష్టమైన నిర్ణయాన్ని తీసుకోవచ్చని బీజేపీ నేత, పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు హరిబాబు వ్యాఖ్యానించారు. కొద్దిసేపటి క్రితం మీడియాతో మాట్లాడిన ఆయన "పవన్ కల్యాణ్ కటీఫ్ అంటే కటీఫే. అతని అభిప్రాయంపైనే మా నిర్ణయం ఆధారపడి వుంటుంది" అన్నారు. తాముగా జనసేనను దూరం చేసుకోవాలని భావించడం లేదని తెలిపారు.
ప్రజా ప్రతినిధులు హుందాగా వ్యవహరించాలని సూచించిన ఆయన, అధికారులు సైతం సమన్వయం పాటించాలని కోరారు. విజయవాడ ఆర్టీయే కార్యాలయం వద్ద జరిగిన ఘటనలు దురదృష్టకరమని అన్నారు. తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల పెంపుపై కేంద్రం ఆలోచిస్తోందని తెలిపారు. హోదాకు ప్రత్యామ్నాయంగానే ప్యాకేజీని ప్రకటించామని, ప్యాకేజీతో ఏపీకి మేలేనని వ్యాఖ్యానించారు.