: 'ఇది మా దేశం - ఇక్కడే ఉంటాం'... అమెరికాలో ప్రవాస భారతీయుల నినాదం


అమెరికాలో ఇటీవలి కాలంలో పెరిగిన జాత్యహంకార దాడులను ప్రస్తావిస్తూ, అమెరికానే తమ దేశమని, తామంతా ఇక్కడే ఉంటామని భారత అమెరికన్లు నినదిస్తున్నారు. పలు చోట్ల సమావేశాలను నిర్వహిస్తూ, జాత్యహంకార దాడులకు నిరసనగా తమ అభిప్రాయాలను స్పష్టం చేస్తున్నారు. అధ్యక్షుడు ఏం చెప్పినా, అమెరికా తమ దేశమేనని దక్షిణాసియా అమెరికన్ల సంఘం ప్రతినిధి సుమన్ వ్యాఖ్యానించారు. వలస వచ్చే వారికి ఆదర్శంగా నిలిచే దేశంలో, తమకు దక్కాల్సిన సమ స్థానం కోసం అడుగుతూనే ఉంటామని ఆయన అన్నారు. బయటి నుంచి వచ్చిన వారు ఐకమత్యంగా ఉండి హక్కులను సాధించుకోవాల్సిన సమయం వచ్చిందని తెలిపారు. చట్టాల అమలు సందర్భంలో హక్కులు ఎమిటన్నది కూడా ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని ఆయన అన్నారు.

  • Loading...

More Telugu News